మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (19:22 IST)

శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం ఇలా చేయాలి..

శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలేంటో చూద్దాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు లేదా ఎరుపు, లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఆపై అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. 
 
నేతితో దీపం వెలిగించడం మరిచిపోకూడదు. తద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
అలాగే శుక్రవారం అమ్మవారికి తెల్లనిపువ్వులు అంటే జాజిపువ్వులు, మల్లెలు సమర్పిస్తే శుభఫలితాలు చేకూరుతాయి. పాలతో పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే.. గరికమాల తీసుకెళ్లడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.