సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 మే 2022 (21:14 IST)

ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా (video)

Tamanna,
Tamanna,
ఎఫ్ 3లో  సర్ ప్రైజ్ లు వుండబోతున్నాయి. ఇలా సర్ ప్రైజ్ ఇచ్చే ఎలిమెంట్స్ లో తమన్నా చేసిన హారిక పాత్ర ఒక మేజర్ హైలెట్ గా వుండబోతుంది. ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. నటనకి ఆస్కారం వున్న హారిక పాత్రలో తమన్నా నటన నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. వెంకటేష్- తమన్నా మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉండబోతున్నాయి. ''మన ఆశలే మన విలువలు'' ఎఫ్3 లో తమన్నా హారిక పాత్ర చెప్పిన క్యాచి డైలాగ్ ఇది. ఈ డైలాగ్ హారిక క్యారెక్టరైజేషన్ లో కీలకంగా వుంటుంది. ఆశలతో మేడలు కట్టే హారికకి సోనాల్ చౌహాన్ పాత్ర పరిచయంతో కథలో బ్రిలియంట్ సర్ ప్రైజ్ రాబోతుంది. ఈ సర్ ప్రైజ్ సినిమాలో ఎక్స్ట్రార్డినరీగా వుండబోతుంది. తమన్నా కెరీర్ లోనే ఎఫ్ 3లో హారిక పాత్ర ది బెస్ట్ గా నిలవనుంది.
 
ఎఫ్3 నుండి తమన్నా రెడ్ హాట్ డ్రెస్‌లో ఉన్న పిక్స్‌ని మేకర్స్ రిలీజ్ చేసారు ఇందులో తను చాలా అందంగా కనిపించింది. ఎఫ్3 ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచడమే కాకుండా ఇప్పుడు ఎక్కడా చూసిన ఎఫ్ 3 ట్రైలర్ హంగామానే కనిపిస్తుంది. ట్రైలర్ లో వెంకటేష్ చెప్పిన '' సూపర్.. ఎక్స్ట్రార్డినరీ.. అదిరిపోయిందిగా' డైలాగ్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే డైలాగ్ ట్రెండ్ అవుతుంది. దీంతో పాటు రేచీకటి పాత్రలో వెంకటేష్, నత్తి వున్న పాత్రలో వరుణ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్, మనీ ప్లాంట్ ఫుడ్, దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ డైలాగ్స్ ని ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ట్రైలర్ కేవలం సాంపిల్ మాత్రమే. ట్రైలర్ కు మించిన నవ్వుల వర్షం థియేటర్ లో కురవబోతుంది.
 
ఎఫ్ 3 మ్యూజికల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'F3' థీమ్ సాంగ్, రెండో పాట 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.  
 
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ లో సందడి చేయబోతున్న ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ, రఘుబాబు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.      
 
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్, పూజా హెగ్డే (స్పెషల్ అప్పీరియన్స్) తదితరులు