1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (12:09 IST)

వెంకటేష్ - వరుణ్ తేజ్ "ఎఫ్-3" ట్రైలర్ రిలీజ్

f3 poster
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన చిత్రం "ఎఫ్-3". ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొనివున్నాయి. మొదటి భాగం కంటే సీక్వెల్ మరింత భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సంక్రాంతి 2019లో వచ్చిన "ఎఫ్-2" చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
మూడేళ్ల తర్వాత వస్తున్న "ఎఫ్-3" చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, నిర్మాత దిల్ రాజు నిర్మించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ నెల 27వ తేదీన విడుదల చేయనుంది. ఈ క్రమంలో ఈ చిత్రం మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 
 
'ప్ర‌పంచానికి తెలిసిన పంచ‌భూతాలు ఐదు.. కానీ ఆరో భూతం ఒక‌టుంది అదే డ‌బ్బు.. డ‌బ్బున్న వాడికి ఫ‌న్, లేని వాడికి ఫ్ర‌స్టెష‌న్ అంటూ’ ముర‌ళి శ‌ర్మ వాయిస్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది'. ఏ ఏ ఏయ్ ఎంటీది ఇలా ఉంది అంటూ' వెంకీ భోజ‌నాన్ని తింటూ అంటుంటాడు. 
 
'మ‌నీ ప్లాంట్ బిర్యానీ, మ‌నీ ప్లాంట్ చారు, మ‌నీ ప్లాంట్ వేపుడు' అంటూ తులసి చెప్తుంది. 'ఏంటీ ఫుడ్ కూడా మ‌నీ ప్లాంట్స్‌తోనేనా' అంటూ వెంక‌టేష్ ఆశ్చ‌ర్యంతో అంటాడు. 'మ‌న ఆశ‌లే మ‌న విలువ‌లు'. 'పాతిక ల‌క్ష‌లు.. దీన్ త‌ల్లి తెల్లారే సరికి యైభై అయిపోవాలి' అంటూ వ‌చ్చిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. 
 
'ఇయ్ ఇలాంటి ఔలా గాల్లంద‌రికి పైస‌లియ్.. అరే సొంత కొడ‌క్కు పైస‌ల్ ఇయ్య‌డానికి మ‌న‌స్సు రాదు' అంటూ దేవుడితో వ‌రుణ్‌తేజ్ మొర పెట్టుకోవ‌డం హాస్యాస్పదంగా ఉంది. 'అదో పెద్ద మాయ‌ల మ‌రాఠి ఫ్యామిలీ.. వాళ్ళది మ‌రాఠి ఫ్యామిలీ అయితే మాది ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఐ వోంట్ లీవ్ అమ్మా'.. 'నా మాట విను వాళ్ళ‌ది పెద్ద ద‌గా ఫ్యామిలీ.. వాళ్ళ‌ది ద‌గా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ' అంటూ వ‌చ్చిన డైలాగ్స్ సూప‌ర్ ఎంట‌ర్టైనింగ్‌గా ఉన్నాయి.
 
ట్రైల‌ర్ చివ‌ర్లో 'ఉన్న‌దెంతా.. ఎంతుంటే అంతా.. మీరేం మాట్లాడ‌రేంట‌డి అంతేగా అంతేగా.. వీడికి సీక్వెల్లో కూడా సేమ్ డైలాగా.. అంతేగా అంతేగా'  అంటూ వ‌చ్చిన సంభాష‌ణ‌లు ఎఫ్‌2 చిత్రాన్ని గుర్తు చేశాయి. ఇక ఓవ‌రాల్‌గా ట్రైల‌ర్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఉంది. ఈ సారి డ‌బుల్ ఎంటర్టైన‌మెంట్ ప‌క్కా అని ట్రైల‌ర్‌ను చూస్తే తెలుస్తుంది.