1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (22:07 IST)

శుక్రవారం పంచమి.. ఈ తిథిలో జన్మించిన వారు ఏం చేయాలంటే? (Video)

Varahi
Varahi
పంచమి తిథి అమావాస్య తరువాత ఐదవ రోజు మరియు పౌర్ణమి తరువాత ఐదవ రోజున వస్తుంది. ఈ తిథి మాంచి ప్రాశస్త్యం వుంది. ఈ తిథి వరాహి అమ్మవారికి ప్రీతికరమైనది. సప్తమాతాలలో వారాహి అమ్మవారు ఒకరు. ఈమెను కొలవడం ద్వారా అన్నీ కార్యాల్లో విజయం వరిస్తుంది. ముఖ్యంగా పంచమి తిథిలో పుట్టిన వారు ఉపవాసం ఉండి, శక్తి దేవిని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఈ పంచమి తిథి శుక్రవారం (మే 20)న వస్తోంది. ప్రతి ఒక్కరూ పంచమి తిథి నాడు ఉపవాసం ఉండి పూజించవచ్చు. 
 
కానీ, ముఖ్యంగా పంచమి తిథి నాడు జన్మించిన వారు వారాహి దేవిని ఆరాధిస్తే కీర్తి గడిస్తారు. పంచమి తిథి నాడు జన్మించిన జాతకులు అమ్మవారి ఆలయంలో వున్న పాము పుట్టకు అంటే నాగమ్మకు పూజలు చేయాలి. లేదంటే అమ్మవారి ఆలయానికి వెళ్లి ఐదు నూనెలు కలిపిన నూనె, ఎరుపు వత్తులతో పంచముఖ దీపాన్ని వెలిగించాలి. వెల్లుల్లితో చేసిన వంటకాలు.. ఉలవలతో చేసిన గారెలు, నవధాన్యాలతో చేసిన వంటకాలు, పెరుగు అన్నం, శెనగలు, పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
అలాగే ఓం శ్రీ పంచమి దేవి నమః.. మంత్రాన్ని జపించడం ద్వారా కుటుంబంలో సౌభాగ్యం ఉంటుంది. అప్పులు, పేదరికం తొలగిపోతాయి. శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే పంచమి రోజున వారాహి అమ్మవారిని ఆ తిథిలో జన్మించిన జాతకులు పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.