గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 14 మే 2022 (23:23 IST)

15-05-2022 నుంచి 21-05-2022 వరకు మీ రాశిఫలాలు (video)

Weekly Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
మనోధైర్యంతో వ్యవహరించండి. యత్నాలు విరమించుకోవద్దు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. వీలైనంత వరకు ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కార్మికులు, చేతివృత్తుల వారికి నిరాశాజనకం. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు ఈ వారం ఆశాజనకం. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కార్మికులకు పనులు లభిస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. మీ ప్రతిపాదనలు ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీపై వచ్చిన నిందలు తొలగిపోగలవు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. మంగళ, బుధవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. గృహమార్పు చికాకుపరుస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణబాధలు తొలుగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కార్మికులు, బిల్డర్లకు ఆశాజనకం. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఆశావహదృక్పథంతో మెలగండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సహాయం ఆశించవద్దు. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పనులు హడావుడిగా సాగుతాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. బిల్డర్లకు కొత్త సమస్యలెదురవుతాయి 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ప్రతికూలతలు అధికం. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. బంధువుల ఆహ్వానం ఉత్తేజాన్నిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి నిరుత్సాహకరం.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెదురవుతాయి. మంగళవారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యవహారాలతో తలమునకలవుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. చిన్న వ్యాపారులకు సామాన్యం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. బిల్డర్లు, కార్మికులకు నిరాశాజనకం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ధైర్యంగా ముందుకు సాగుతారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బుధ, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. కళ్లు, ఉదరానికి సంబంధించిన సమస్యలెదురవుతాయి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధ్యాయుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
కలిసివచ్చిన అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పంతాలు, భేషజాలకు పోవదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. శుక్ర, శనివారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆశించిన పదవులు దక్కవు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్పలితమిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధి కాదు. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం పై చదవులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. పాత పరిచయస్తుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. న్యాదరు, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. సోమ, మంగళవారాల్లో పనులు బాధ్యతలు అప్పగించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. బిల్డర్లు, కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఓర్పుతో మెలగండి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. అతిగా ఆలోచింపవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆది, బుధవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మీ అశక్తతను కుటుంబీకుల అర్థం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల కలయిక ఉత్తేజపరుస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సామాన్యం. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. గృహనిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది.