గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (11:21 IST)

భక్తుల కోసం తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం

Kedarnath
ద్వాదశ జ్యోతిర్లాంగల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. వేద మంత్రాల నడుమ అర్చకులు, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి సమంక్షంలో ఆలయం తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులను దర్శనం కోసం అనుమతించారు. 
 
హిమాలయాల పర్వత శ్రేణుల మధ్య కొలువైన ఈ ఆలయం సంవత్సరంలో ఆరు నెలల పాటే భక్తులకు దర్శనాలకు అందుబాటులో ఉంటుంది. వైశాఖ మాసంలో తెరిచే ఆలయాన్ని కార్తీక పౌర్ణమి అనంతరం మూసివేస్తారు. ఆ తర్వాత తీవ్ర మంచుతో కూడిన పరిస్థితుల వల్ల ఆలయాన్ని తెరిచే అనుకూల పరిస్థితులు ఉండవు. 
 
చార్ ధామ్ యాత్రలో రోజువారీగా భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం పరిమితి విధించింది. కేదార్ నాథ్ ఆలయాన్ని నిత్యం 12 వేల మంది కేదార్ నాథ్ ఆలయాన్ని 15 వేల మంది సందర్శించుకోవచ్చు. భక్తులు కరోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్టు చూపించాల్సిన అవసరం లేదు .