శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (18:33 IST)

రైల్వే ఉద్యోగం చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్...

Jobs
రైల్వే ఉద్యోగం చేయాలనుకునేవారికి షాకింగ్. భారతీయ రైల్వే గత ఆరేళ్లలో 16 రైల్వే జోన్లలో 72,000 గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టుల్ని తొలగించినట్టు సమాచారం. 
 
త్వరలో భారతీయ రైల్వే మరో 15,495 పోస్టుల్ని తొలగించేందుకు సిద్దమవుతోంది. కొత్త టెక్నాలజీ యుగంలో ఈ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు నిరుపయోగంగా ఉండటంతో వాటిని కూడా రైల్వే రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ప్యూన్, వెయిటర్స్, గార్డెనర్స్, స్వీపర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ లాంటి పోస్టులను రైల్వే తొలగించినట్లు తెలుస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ మధ్య 16 రైల్వే జోన్లలో 56,888 పోస్టుల్ని రైల్వే తొలగించింది.
 
నార్తర్న్ రైల్వేలో 9,000 పోస్టులు, సదరన్ రైల్వేస్ లో 7,524 పోస్టుల్ని తొలగించింది. అధికారిక సమాచారం ప్రకారం 16 రైల్వే జోన్లు 81,000 పోస్టుల్ని ప్రతిపాదిస్తే అందులో 56,888 పోస్టుల్ని తొలగించింది.