శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:27 IST)

మరింతగా తగ్గిన కోవిడ్ కేసులు - మరణాలు 1072

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 1072 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,00,055 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 168.47 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.