అసత్య ప్రచారాలు చేయొద్దు : దర్శకుడు కొరటాల శివ
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అంచనాలను చేరుకోలేక పోయింది. ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలతో కొరటాల సతమతమవుతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
'ఆచార్య' చిత్రం కారణంగా బయ్యర్లకు వచ్చిన నష్టాలను భర్తీ చేసే పనిలో కొరటాల శివ ఉన్నట్టు సమాచారం. అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పక్కన బెట్టాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
దీనిపై కొరటాల శివ స్పందించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా పుకార్లు పుట్టించడం ఆపాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆ రోజున ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసేలా సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం. పైగా ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నట్టు వినికిడి.