సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మే 2022 (13:33 IST)

నేను మంచి కొడుకును కాదు మమ్మీ... ఆర్జీవీ ట్వీట్

rgv with mother
అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. తాను మంచి కొడుకును కాను అమ్మా అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తనదైనశైలిలో తన మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. తాను మంచి కొడుకును కాదంటూ వ్యాఖ్యానించారు. 
 
"హ్యాపీ మదర్స్ డే మామ్. నేను ఓ మంచి కొడుకును కాదు. కానీ, ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ" అంటూ చేతిలో గ్లాసు పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
 
తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుతూ ఫోటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. "మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.