మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారు : రాహుల్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్

prakashraj
సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ ట్వీట్ చేశారు. మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారో చెప్పాలని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణాలో పర్యటిచారు. ఈ పర్యటనలోభాగంగా, వరంగల్‌ సభలో చేసిన డిక్లరేషన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు తీవ్ర దుమారాన్ని రేపింది. 
 
తెలంగాణాను దార్శనికుడైన కేసీఆర్ పరిపాలనిస్తున్నారని, మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారో చెప్పాలని ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గోటికి కూడా ప్రకాష్ రాజ్ సరిపోరని కామెంట్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్‌కు సినిమాలు లేవని, రాజ్యసభ సీటు కోసం వెంపర్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఒక్క రోజు కూడా ప్రకాష్ రాజ్ ప్రజల్లోకి రాలేదని అసలు కేసీఆర్ గురించి ప్రకాష్ రాజ్‌కు ఏం తెలుసని మండిపడ్డారు.