25 నిమిషాలపాటు ములాఖత్.. రాహుల్ గాంధీకి పర్మిషన్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు అనుమతి లభించింది. చంచల్‌గూడ జైల్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ సహా 17మంది నేతలను రాహుల్ పరామర్శించనున్నారు. 25 నిమిషాలపాటు ఎన్ఎస్‌యూఐ విద్యార్థులతో ములాఖాత్ కానున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వచ్చేందుకు అనుమతి కోరుతూ జరిగిన వివాదంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
వీసీ చాంబర్ ముట్టడి నేపథ్యంలో జరిగిన వివాదంపై 8 సెక్షన్‌ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. గత వారం రోజులుగా విద్యార్థులు జైల్లోనే ఉన్నారు.
ఈ క్రమంలో జరిగిన పరిణామాలపై విద్యార్థులను రాహుల్ అడిగి తెలుసుకోనున్నారు. రాహుల్ గాంధీ చంచల్ గూడ జైల్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.