ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (16:14 IST)

శివ నాగేశ్వరరావు దోచేవారెవరురా గోవా షెడ్యూల్ పూర్తి

Dochevarevarura still
Dochevarevarura still
సిసింద్రీ, మ‌నీమ‌నీ వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శివ నాగేశ్వరరావు చాలా కాలం గేప్ తీసుకున్నారు. ఇప్పుడు మ‌ర‌లా మెగా ఫోన్ పెట్టారు. దోచేవారెవరురా అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు.
 
IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా 'దోచేవారెవరురా'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మధ్యే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
తాజాగా ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బిత్తిరి సత్తి, అజయ్ గోష్‌తో పాటు హీరో, హీరోయిన్ తో సహా పలువురు నటీనటులపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.