గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (22:38 IST)

అమ్మను ఆప్యాయంగా పలకరించండి... ఆనందంతో పొంగిపోతుంది.

Mother's Day
Mother's Day
మదర్స్ డే రోజున అమ్మను ఆప్యాయంగా పలకరించండి. ఆమె చేసిన త్యాగాన్ని, కృషిని ఓసారి ఆమెకే గుర్తు చేయండి. పనుల్ని పక్కనపెట్టి మదర్స్ డే రోజు ఆమెకు ఎక్కువగా ఖర్చు చేసుకొనే శక్తిని ఇవ్వడం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. తల్లికి ఆర్థిక స్వాతంత్ర్యం, భద్రతను కల్పిస్తే అది జీవితాంతం ఉపయోగపడుతుంది. 
 
ఈ మదర్స్ డే సందర్భంగా తల్లికి ఆరోగ్య కవరేజీని బహుమతిగా ఇవ్వడం వలన ఆమె ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అవసరమైనప్పుడు ఉత్తమ వైద్య సంరక్షణను పొందగలరు. అలాగే అమ్మతో సరదాగా గడపడం, పిక్నిక్‌కు తీసుకెళ్లడం, కేక్ చేసి కట్ చేయించడం, షాపింగ్‌కు తీసుకెళ్లడం, కలిసి భోజనం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. 
 
వీటితో పాటుగా అమ్మపై ఉన్న ప్రేమను తెలపడానికి గ్రీటింగ్ కాడ్స్, మీ చేతితో రాసిన ఉత్తరాలు కూడా ఎంతో ఉపయోపడతాయి. పలకరింపుకే పొంగిపోయే మనస్సు.. ఇలాంటి సంతోషాలను మీరు ఆమెకు ఇస్తే జీవితాంతం ఆమెకు చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. హ్యాపీ మదర్స్ డే.