గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బీజేపీకి మద్దతిచ్చి కేసులు మాఫీ చేయించుకుంటారా? ఆర్ఆర్ఆర్ ప్రశ్న

raghurama krishnaraju
దేశంలో త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీపి వైకాపా పార్టీ మద్దతు ఇవ్వనుంది. దీనిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని చెప్పే దమ్మూధైర్యం వైకాపా పెద్దలకు ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, గత రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడం వల్ల బీజేపీకి స్వచ్చంధంగా మద్దతు ఇచ్చామని వైకాపా నేతలు చెప్పారని గుర్తు చేశారు. 
 
ఈ దఫా బీజేపీ అడిగితే మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని విజయసాయి రెడ్డి చెప్పడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెడితేనే ఈసారి మద్దతిస్తామని చెప్పగలరా అని విజయసాయిని ప్రశ్నించారు. 
 
అలాకాకుండా, వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ వారి ప్రమేయం లేదని, అలాగే, తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని విజయసాయి కోరే అవకాశం ఉందా అని రఘురామ వ్యాఖ్యానించారు.