1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Anyone in Congress can be CM: Revanth Reddy

కాంగ్రెస్‌లో ఎవరైనా సీఎం కావచ్చు: రేవంత్‌రెడ్డి

Congress
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ మాటలు అబద్ధాల మూటలని విమర్శించారు. దత్తత గ్రామాలను కేసీఆర్‌ దగా చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌ దత్తత గ్రామాల్లో వాస్తవాలు తెలిపేందుకే దీక్ష చేశామని తెలిపారు. కేసీఆర్‌ ఒక్క హామీనీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

ఒక్క హామీ నెరవేర్చినా తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పానని, అయినా సీఎం తనతో చర్చకు రాలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. అసైన్‌మెంట్ భూములు ఇచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని ఇందిరగాంధీదేనని చెప్పారు.

ప్రజలను దోచుకుంటున్న టీఆర్ఎస్‌ అడవి పందులు, దున్నలు అని విరుచుకుపడ్డారు. గజ దొంగల చేతుల్లొ తెలంగాణ బందీ అయిందని, కేసీఆర్‌ కోసం తెలంగాణ రాలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు..
About Writer
ఎంజీ
తర్వాతి కథనం
సుప్రీంకోర్టు ఎదుట నిప్పంటించుకున్న మహిళ మృతి