మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 25 ఆగస్టు 2021 (18:36 IST)

సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌

ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్ ప్రారంభం అయింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. 
 
నెలల చిన్నారికి సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పీసీవీ వ్యాక్సిన్ ను వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లు అందిస్తున్న ప్రభుత్వం, కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్‌లు పిల్లలకు ప్రభుత్వం ఇవ్వ‌నుంది. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.