శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (11:24 IST)

మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కులో డిటోనేటర్ల పేలుళ్లు

చిత్తూరు జిల్లా మదనపల్లిలో అర్థరాత్రి వేళ బాంబు పేలుళ్ల కలకలం సృష్టించాయి. స్థానిక ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు కలకలం సృష్టించాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్‌ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చారు. 
 
భారీగా పేలుడు సంభవించడమే గాక బండరాళ్లు ఆ పరిసరాల్లోని నివాస గృహాలపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు దెబ్బతినడంతో పాటు ఐదుగురికి గాయాలుకాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డీమార్ట్‌ సంస్థపై స్థానికుల మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల విచారిస్తున్నారు.