1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Asaduddin Owaisi Comments on Telangana Elections 2023 Support

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కే మా మద్దతు : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

asaduddin owaisi
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ భారసా అధినేత, సీఎం కేసీఆర్‌కే మద్దతు ఇస్తామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల కేసీఆర్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం హైదరాబాద్ నగరంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదేళ్లకాలంలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, ఆయన హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు.
 
తెలంగాణాలో బీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీల మధ్య దోస్తీ మొదటి నుంచి కొనసాగుతుందన్నారు. మస్జిల్ తమ మిత్రపక్షమని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. అసదుద్దీన్ ఇటీవల కూడా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం సీఎం కేసీఆర్‌ను మళ్లీ గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని అన్నారు. తాము తెలంగాణాలో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. 
తర్వాతి కథనం
ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా