1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Bathini fish prasadam distribution on June 8

చేపమందుకు తేదీ ఖరారు : జూన్ 8 నుంచి మందు పంపిణీ

Bathini Brothers
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బత్తిని సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి జరుగనుంది. ఉబ్బసం రోగుల రోగుల కోసం ఈ చేప ప్రసాదాన్ని ప్రతియేటా పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది కూడా ఇదేవిధంగా పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని బత్తినిగౌడ్ సోదరులు తెలిపారు. 
 
మృగశిర కార్తెను పురస్కరించుకుని 8న ఉదయం 10 గంటల నుంచి ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పంపిణీ ఉంటుందన్నారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని మృగశిర ట్రస్ట్ భవనంలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రసాద పంపిణీ రోజంతా కొనసాగుతుందని వివరించారు. 
తర్వాతి కథనం
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం : బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద...