శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (09:33 IST)

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం : బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద...

చిత్తూరు జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మదనపల్లిలోని బిస్కెట్‌ ఫ్యాక్టరీ దగ్గర బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి చెందారు. 
 
కర్నాటక నుంచి కుర్గేపల్లెకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతుల వివరాలను తెలిపారు. మృతులు మదనపల్లెకు చెందిన నరేష్ (32), ఉమాదేవి (27), చిన్నారి నిషిత (2)గా పోలీసులు గుర్తించారు.