బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (17:10 IST)

చిత్తూరు జిల్లాలో దారుణ హత్య.. కుమార్తెతో ప్రియుడు.. ముక్కలు ముక్కలుగా నరికి?

చిత్తూరు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. పలమనేరులో ఐదు రోజు క్రితం అదృశ్యమైన ధనశేఖర్ అనే 23 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పెంగరగుంటకు చెందిన ఓ బాలికను ధనశేఖర్ రెండేళ్ల పాటు ప్రేమిస్తున్నాడు. అయితే బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ మృతదేహం సొంత పొలంలోనే కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. 
 
పోలీసులు ధనశేఖర్ కాల్ డేటా ఆధారంగా బాలిక తండ్రి బాబును అరెస్ట్ చేశారు. విచారణలో శనివారం రాత్రి కుమార్తెతో ధనశేఖర్ వుండటాన్ని చూశానని.. అతడిని కత్తితో నరికి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఆపై మృతదేహాన్ని బావిలో పడేశాడని.. మృతదేహం బావిలో తేలిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టినట్లు అంగీకరించాడు. నేరం అంగీకరించడంతో బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.