సోనూసూద్ సంచలన నిర్ణయం: పాన్-ఇండియా లెవెల్లో ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ
గత ఏడాది నుంచి కరోనా వైరస్ తో ఎంతగానో ఇబ్బంది పడుతున్న పేద వారికి సోనూసూద్ నిర్విరామంగా సహాయలు చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో కష్టాలు లేకుండా చేస్తున్నాడు. ఇక సెకండ్ వేవ్ లో సోనూసూద్ సహాయల సంఖ్య మరింత ఎక్కువగా మారింది.
సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళతాను అని మాట ఇచ్చేశాడు. అన్నట్లుగానే ఆక్సిజన్ ప్లాంట్స్‌ను జెట్ స్పీడ్ లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నాడు. ఇక ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్థనాధాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా www.umeedbysonusood.com కు లాగిన్ అవ్వాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్స్ డిటిడిసి ద్వారా అవసరమైన వారికి పంపబడుతుందని తెలియజేశారు.