1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Beggar-free city operation put into effect in Hyderabad

ఇవాంకా ట్రంప్ రాకతో బిచ్చగాళ్లను కష్టకాలం... ఎక్కడ?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈనెల 28, 29వ తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 28వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇవాంకా వస్తున్నారనీ హైదరాబాద్‌ను బెగ

Hyderabad
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈనెల 28, 29వ తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 28వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇవాంకా వస్తున్నారనీ హైదరాబాద్‌ను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చుతున్నారు. ఇందుకోసం బిచ్చగాళ్ళ కోసం హైదరాబాద్ నగర పోలీసులు వలపన్నిమరీ గాలిస్తున్నారు. అంతేనా బిచ్చగాళ్ల ఆచూకీ తెలిపితే రూ.500 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. 
 
ఈ తరహా ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇప్పటివరకు 235మంది పురుషులు, 125 మంది మహిళలను చేరదీసి చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ప్రత్యేక శిబిరాలతో పాటు ఆనందాశ్రమాల్లో ఆవాసం కల్పించామన్నారు. గత నెల 20న ప్రారంభించిన ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో 250 మందిని వారి కుటుంబీకులకు అప్పగించినట్లు తెలిపారు. 
 
వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వేలిముద్రలు, ఆధార్‌ నంబర్లు సేకరించారు. వారు మళ్లీ భవిష్యత్తులో ఈ వృత్తిలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. యాచకుల్లో నైపుణ్యాలను గుర్తించి అవసరమైతే వారికి శిక్షణ ఇచ్చి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోలు బంకులు, ఇతర చోట్ల ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'బాహుబలి' స్టంట్‌కి కేరళ యూత్ యత్నం.. క్షణాల్లో గాల్లో... (వీడియో)