మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 10 నవంబరు 2017 (11:54 IST)

నా మొదటి అకౌంట్ ఎక్కడ ఓపెన్ అయిందో తెలుసా? నిజం చెప్పిన రష్మి

'మాది వైజాగ్. సినిమాలంటే చచ్చేంత ఇష్టం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని కుటుంబసభ్యులను కోరా. మా కుటుంబ సభ్యులకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నా మనస్సు అందుకు అంగీకరించలేదు. నేను ఎలాగైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. వచ్చిన కొన్ని నెలల పాటు పర

'మాది వైజాగ్. సినిమాలంటే చచ్చేంత ఇష్టం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని కుటుంబసభ్యులను కోరా. మా కుటుంబ సభ్యులకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నా మనస్సు అందుకు అంగీకరించలేదు. నేను ఎలాగైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. వచ్చిన కొన్ని నెలల పాటు పర్సులో డబ్బులు లేవు. చాలా ఇబ్బందిపడ్డా. ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.. అనుకోవడం కాదు.. అస్సలు నాకు ఇష్టం ఉండదు. నేను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. నా వయస్సు నాకు తెలుసు. అప్పటికి కూడా నాకు బ్యాంకు అకౌంట్ లేదు.
 
మొదటిసారి అన్నపూర్ణ స్టూడియోస్ వారు నాకు చెక్ ఇచ్చారు. ఆ చెక్‌ను క్యాష్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అందుకే బ్యాంకుకు వెళ్ళా. హైదరాబాద్ లోనే మొదటి బ్యాంకు అకౌంట్‌ను ఓపెన్ చేశా. డబ్బు విలువ నాకు బాగా తెలుసు. కష్టంలో పుట్టి.. కష్టంలో పెరిగా. ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నా.. నాకు ఎలాంటి ఇబ్బంది ప్రస్తుతం లేదు. నాకు డబ్బు ముఖ్యం. నాకు ఎంత తక్కువ డబ్బిచ్చినా సినిమాల్లోగాని, బుల్లితెరమీద గాని నటించేందుకు సిద్థంగా ఉన్నా"
 
ఇదంతా ఎవరు చెప్పారో తెలుసా.. హాట్ యాంకర్ రష్మి. తాను మొదట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తను ఎదుర్కొన్న సమస్యను నటుడు అలీతో పంచుకుంది రష్మి. రష్మి కష్టాన్ని విన్న అలీ ఒక్కసారిగా చలించిపోయారు. ఆమెకు ధైర్యం చెప్పారు.