శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 నవంబరు 2017 (12:43 IST)

చిరంజీవి ఇంట్లో చాలాసార్లు దొంగతనం చేశా... ఆ డబ్బుతో... చెన్నయ్య

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి ప్రవేశించాలంటే సామాన్యం కాదు. ఆయనకు నమ్మినబంట్లు అలా కాపలా కాస్తుంటారు మరి. ఐతే కంచే చేను మేస్తే ఏం చేయగలం. అదే చిరంజీవి విషయంలోనూ జరిగింది. ఆయన ఇంట్లోనే పనిచేసే సర్వర్ చెన్నయ్య ఛాన్స్ దొరికితే చాలు డబ్బు కొట్టేస్తూ ప్లాట

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి ప్రవేశించాలంటే సామాన్యం కాదు. ఆయనకు నమ్మినబంట్లు అలా కాపలా కాస్తుంటారు మరి. ఐతే కంచే చేను మేస్తే ఏం చేయగలం. అదే చిరంజీవి విషయంలోనూ జరిగింది. ఆయన ఇంట్లోనే పనిచేసే సర్వర్ చెన్నయ్య ఛాన్స్ దొరికితే చాలు డబ్బు కొట్టేస్తూ ప్లాట్లు కొనుగోళ్లు చేస్తూ కోటీశ్వరుడయ్యాడంటే అంతా ముక్కునవేలేసుకోవాల్సిందే. 
 
ఇది నిజం. పోలీసులకు పట్టుబడిన చెన్నయ్య ఇదే విషయాన్ని అంగీకరించాడట. తను చిరంజీవి ఇంట్లో చోరీలు చేయడం ఇదే మొదటిసారి కాదనీ, గతంలో చాలాసార్లు దొంగతనం చేసినట్లు వెల్లడించాడు. ఆ డబ్బుతో తను పలు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేశాననీ, వాటికి సంబంధించిన వాయిదాలు కట్టలేకు... ఒకేసారి అప్పు మొత్తం తీర్చేయాలని మరోసారి దొంగతనం చేయబోయి దొరికిపోయినట్లు పోలీసుల ముందు చెప్పాడట. మొత్తమ్మీద ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని... చిరంజీవికి నమ్మకంగా వుంటూనే దోచేసుకున్నాడన్నమాట.