శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 నవంబరు 2017 (19:19 IST)

ఏ ముఖం పెట్టుకుని చిరంజీవి ఇంటికి వెళ్లావు రాజశేఖర్... సెటైర్లు...

హీరో రాజశేఖర్ నటించిన చిత్రం గరుడవేగ వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్‌గా సన్నీ లియోన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ గరుడవేగ చిత్రంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ చిత్ర

హీరో రాజశేఖర్ నటించిన చిత్రం గరుడవేగ వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్‌గా సన్నీ లియోన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ గరుడవేగ చిత్రంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ చిత్రం ప్రీమియర్‌ను చూసేందుకు రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని రాజశేఖర్ దంపతులు ఆహ్వానించారు. 
 
దీనికి సంబంధించిన ఫోటో ఒకటి హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మొన్నటివరకూ బద్ధశత్రువులా మాట్లాడి మెగాస్టార్ చిరంజీవిని పిలిచేందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి రాజశేఖర్ వారి మాటలకు ఎలా కౌంటర్ ఎటాక్ ఇస్తారో చూడాల్సిందే.