1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Big shock to BJP : Ravula Sridhar Reddy quits party, to join TRS

తెలంగాణలో బీజేపీకి షాక్‌.. టీఆర్ఎస్‌లోకి శ్రీధర్ రెడ్డి

Big shock to BJP
Ravula Sridhar Reddy
తెలంగాణలో బీజేపీకి షాక్‌ తగిలింది. బీజేపీ సీనియర్‌ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో 11 సంవత్సరాలుగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేయడం అందరినీ షాక్‌ గురిచేసింది. అయితే...తన రాజీనామాపై రావుల శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఒక ప్రైవేట్ బ్యాంకులో మంచి స్థానంలో ఉన్న తాను తెలంగాణ కోసం ఉద్యోగం వదిలి బీజేపీ పార్టీలో చేరానన్నారు. 
 
గత పది సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నానని... ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడినా కూడా ప్రజాల్లోనే ఉన్నానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి అబద్దలతో ప్రజలను మభ్యపెడుతుందని...బిజెపి ప్రభుత్వంతో తెలంగాణకు న్యాయం జరగదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తుందని... బీజేపీ ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు. 
 
కేంద్ర ప్రభుత్వ విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని.. వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఏదయినా బిల్లు తెస్తే పార్టీలో ఒక చర్చ కూడా లేదని...తెలంగాణకు లాభం అవుతుందా లేదా అనే చేర్చే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని... బీజేపీ ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తుందని ప్రశ్నించారు. కేసిఆర్ నాయకత్వంలో పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని... నాతో మరికొందరు టిఆర్ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు.
తర్వాతి కథనం
గాజువాకలో బాలుడి కిడ్నాప్... అప్పు తిరిగివ్వలేదని..?