గాజువాకలో బాలుడి కిడ్నాప్... అప్పు తిరిగివ్వలేదని..?
గాజువాకలో నాలుగేళ్ల బాలుడిని ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్ ఘటన కలకలం రేగింది. అయితే గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
బాలుడి తండ్రి నరేష్ యాదవ్ ఒక పరిశ్రమను నడుపుతున్నారు. ఆ పరిశ్రమ కోసం ఒకరి వద్ద రూ. 40 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో పరిశ్రమ నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అయినా అప్పు తీర్చుతానని చెప్పినప్పటికీ వినకుండా నరేష్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.