సంబంధిత వార్తలు
- మహిళ మెదడులో 2 సూదులు.. ఎలా చొచ్చుకెళ్లాయో తెలియదు..
- ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు
- అక్రమ సంబంధం కోసం సొంత చెల్లిని ప్రియుడికిచ్చి పెళ్ళి చేసిన అక్క, ఎక్కడ?
- పానీ పూరీలను గప్ చుప్‌తో మింగింది.. అంతే ఆమె ప్రాణాలు పోయాయి...!
- భర్తకు ప్రాణగండం అంటూ వివాహిత మెడలో తాళి కట్టిన నకిలీ జ్యోతిష్యుడు
వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్... మాజీ భర్తపై అనుమానం?
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్‌కు గురైంది. మరో మహిళతో కలిసి రోడ్డుపై నడిచి వెళుతుండగా కొందరు దుండగులు వచ్చిన ఈ మహిళను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఇది స్థానికంగా కలకలం రేపింది.
ఈ కిడ్నాప్‌పై స్థానిక పోలీసులకు సమాచారం అదించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక టీమ్‌లు కిడ్నాపైన మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, దీపిక అనే మహిళ మరో మహిళతో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా, గుర్తు తెలియని దుండగులు కొందరు దీపికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ యువతి గత నాలుగేళ్ళ క్రితం అఖిల్ అనే యువకుడిని ప్రేమ పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత అతనికి దూరమైంది. సో.. అతనే కిడ్నాప్ చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ నీ పరిశీలిస్తున్నారు. దుండగులు అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని భావించి, ఆ వైపు రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
