బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (09:59 IST)

గచ్చిబౌలిలో పరువు హత్య.. మరో ప్రణయ్ కథ.. కూతురు ప్రేమించి..?

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. చందానగర్‌కు చెందిన హేమంత్‌కు ఇటీవల ప్రేమ వివాహం జరిగింది. అనంతరం .. గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో యువజంట నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు హేమంత్‌ను కిడ్నాప్‌ చేశారు. హేమంత్‌ అదృశ్యంపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో హేమంత్‌ శవమై కనిపించాడు. ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. యువకుడిని కిరాతకంగా తండ్రి హత్య చేయించాడని తెలుస్తోంది.