మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 24 సెప్టెంబరు 2020 (19:07 IST)

స‌న్‌రైజ‌ర్స్‌తో ది కొటక్ మైటీం కార్డ్‌... కావాలంటే ఇలా చేయండి

కొట‌క్ మ‌హీంద్ర బ్యాంక్ (కొట‌క్‌), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు అధికారిక భాగ‌స్వామిగా మారిన‌ట్లు వెల్ల‌డించింది. మైటీం కార్డ్స్ పేరుతో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన డెబిట్ మ‌రియు క్రెడిట్ కార్డుల‌ను ఆవిష్క‌రించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సీజ‌న్‌లో భార‌త‌దేశంలోని అత్య‌ధిక ప్రేక్ష‌కుల యొక్క అభిమాన క్రీడ‌ అయిన క్రికెట్‌ను మ‌రింత‌గా ఇష్ట‌ప‌డేందుకు మ‌రో అవ‌కాశం ముందుకు వ‌చ్చింద‌ని తెలిపింది.
 
ప్ర‌త్యేకంగా `క్రికెట్ థీమ్‌`తో డిజైన్ చేయ‌బ‌డిన డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డును వారి ఫేవ‌రెట్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చిత్రాల‌తో సొంతం చేసుకోవ‌చ్చున‌ని వివ‌రించింది. ది కొట‌క్ క్రికెట్ ఎడిష‌న్ రేంజ్ డెబిట్, క్రెడిట్ కార్డులు ప్లేయ‌ర్ల యొక్క టీం విజువ‌ల్స్ క‌లిగి ఉంటాయి. ది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ లోగో, వాట‌ర్ మార్క్, అఫిషియ‌ల్ టీం క‌ల‌ర్స్ క‌లిగి ఉన్న ఈ కార్డులు త‌మ అభిమాన జ‌ట్టు ప‌ట్ల ప్రేమ‌తో త‌ప్ప‌నిస‌రిగా క‌లిగి ఉండాల‌నే ప్రేక్ష‌కుల‌ కాంక్ష‌కు అనుగుణంగా తీర్చిదిద్ద‌బ‌డ్డాయి.
 
ఈ సంద‌ర్భంగా కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ఆల‌ర్నేట్ చాన‌ల్స్ ఆండ్ క‌స్ట‌మ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ డెలివ‌రీ  ప్రెసిడెంట్ శ్రీ పునీత్ క‌పూర్ త‌న అభిప్రాయాలు పంచుకుంటూ, ``భార‌త‌దేశంలోని అభిమాను‌లు ప్ర‌తిఏటా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే క్రీడ ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మేం ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని తెలియ‌జేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం.
 
కొట‌క్ యొక్క క్రికెట్ ఎడిష‌న్ రేంజ్ డెబిట్ మ‌రియు క్రెడిట్ కార్డులు, మై టీం కార్డులు ఈ సీజ‌న్‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మారుస్తాయి. ల‌క్ష‌లాది స‌న్‌రైజ‌ర్స్ అభిమానులకు త‌మ టీంకు చెందిన గుర్తుల‌కు, చిత్రాల‌ను ప్ర‌త్యేకంగా తెలియ‌జెప్పే, ఉద్విగ్న‌మైన అనుభూతిని పొందే అవ‌కాశం ఈ కార్డులు అందించ‌నున్నాయి. `` అని వెల్ల‌డించారు.
 
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సీఈఓ శ్రీ కె. ష‌ణ్ముగం ఈ సంద‌ర్భంగా త‌మ అభిప్రాయాలు పంచుకుంటూ, ``భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ బ్యాంకుల‌లో ఒక‌టైన కొట‌క్ మ‌హీంద్ర బ్యాంక్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌ట్టుక‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నందుకు మేం ఎంతో గ‌ర్విస్తున్నాం. క్రీడా రంగంలో భాగస్వామ్యం మ‌రియు ప్రోత్సాహం క‌ల్పించ‌డంలో కోట‌క్ పాత్ర ప్ర‌త్యేక‌మైన‌ది. హైద‌రాబాద్‌లో బ్యాడ్మింట‌న్ క్రీడ‌కు త‌న‌వంతు ప్రోత్సాహాన్ని కొట‌క్ అందిస్తుండ‌టం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నందుకు మేం కొట‌క్ సంస్థ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాం. ప్ర‌స్తుతం స‌వాల్‌తో కూడుకు త‌రుణంలో వారి అండ అభినందనీయం`` అని వెల్ల‌డించారు.
 
కొట‌క్ వినియోగ‌దారుల‌కు త‌మ‌కు ఆస‌క్తి క‌లిగిన మైటీం డెబిట్ కార్డును వెబ్‌సైట్‌లోని కొట‌క్‌ మై ఇమేజ్ గ్యాల‌రీ, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎంచుకోవ‌చ్చు. కొట‌క్ క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారులు మైటీం క్రెడిట్ కార్డుల‌ను నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొంద‌వ‌చ్చు. కొట‌క్ బ్యాంక్ వినియోగ‌దారులు కానివారు సైతం కొట‌క్ సేవింగ్స్ అకౌంట్‌ను తెరిచి త‌మ‌కు న‌చ్చిన ఇమేజ్‌తో కూడిన మైటీం డెబిట్ కార్డును సొంతం చేసుకోవ‌చ్చు.