మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (11:43 IST)

దీక్షిత్ హత్య కేసు కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్?

ఇటీవల మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడి తల్లిదండ్రులు రంజిత్‌, వసంత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలించారు. 
 
కిడ్నాపర్లు టెక్నాలజీ వాడుతూ పోలీసులకు చిక్కకుండా వసంతకు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తుండటంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. 
 
కిడ్నాప్ చేసిన దుండగులు వసంతను రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, ఆ డబ్బు తీసుకుని వెళ్లినప్పటికీ కిడ్నాపర్లు దాన్ని తీసుకోవడానికి రాలేదు. చివరకు బాలుడిని హత్య చేశారు. ఆ బాలుడి మృతదేహం గుట్టల్లో లభ్యమైనట్లు తెలిసింది.
 
ఇదిలావుండగా, దీక్షిత్‌ని హత్య చేసిన ఇద్దరు (కిడ్నాపర్ల) నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు బాలుడికి సమీప బంధువులేనని సమాచారం. మరో ఇద్దరు బయటి వ్యక్తులుగా తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులిద్దరినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.