గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2020 (20:21 IST)

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజటివ్

తెలంగాణ ప్రజా ప్రతినిధులను కరోనా వెంటాడుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.
 
ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు వెళ్లారు. అక్కడ తనకు కరోనా సోకినట్లుగా భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
గత రెండురోజులుగా సంజయ్ కుమార్ పలువురిని కలిసారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కరోనా బాధితులకు సేవలందించారు. కాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు.