శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:53 IST)

జగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. కవిత కోసం..?

Jagtial MLA
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. నిజానికి గతంలో కవిత కోసం తన పదవికే రాజీనామా చేస్తానని సంజయ్ గతంలో వార్తల్లో నిలిచారు. సోమవారం కూడా కవిత ఎమ్మెల్సీగా గెలిచాక ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరు కావడంతోనే కరోనా వైరస్ సోకి వుండవచ్చునని భావిస్తున్నారు. 
 
ఇక మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరీక్షలు చేయించుకున్న సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
 
రెండు రోజులుగా సంజయ్ కుమార్ ప్రముఖులను కలిసినట్టు చెప్తున్నారు. దీంతో ఆయనను కలిసిన ప్రముఖులు అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇక తనను కలిసిన వారు విధిగా పరీక్ష చేయించుకోవాలని అలానే వారంతా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సంజయ్ కుమార్ సూచించారు.