మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:20 IST)

వలంటీర్‌కు అనారోగ్యం.. ఆగిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ట్రయల్స్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైవున్న కంపెనీల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా ఉంది. అయితే, ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకున్ వలంటీర్‌కు అనారోగ్యం చేసింది. దీంతో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ప్రయోగ పరీక్షల్లో భాగంగా ఈ టీకాను తీసుకున్న వలంటీర్లకు తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ‘అన్ని కొవిడ్19 వ్యాక్సిన్ ట్రయల్స్‌నూ నిలిపివేశాము. మూడో దశలో ఉన్న 'ఎన్సింబెల్' ట్రయల్స్ కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. అధ్యయనంలో పాల్గొన్న ఓ వ్యక్తికి అనుకోకుండా సమస్యలు రావడమే ఇందుకు కారణం అని జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన వెలువరించింది.
 
ఈ చర్యతో ఫేజ్ 3లో భాగంగా 60 వేల మంది వలంటీర్ల నమోదును కూడా సంస్థ నిలిపివేసింది. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో సంస్థ నియమ నిబంధనలను పాటిస్తూ, ప్రస్తుతానికి ట్రయల్స్‌ను నిలిపివేశామని, త్వరలోనే తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
కాగా, మూడో దశలో భాగంగా 200 దేశాల్లో 60 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని జాన్సన్ అండ్ జాన్సన్ భావించింది. ఈ ప్రక్రియ మొత్తం ఇప్పటికి నిలిచిపోయినట్టే!