1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. CM KCR To Hold Cabinet Meeting Today at Pragathi Bhavan

నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ : ఉద్యోగ నోటిఫికేషన్‌పై చర్చ

Telangna
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం సోమవారం జరుగనుంది. ఇందులో ఉద్యోగాల నోటిఫికేషన్‌తోపాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా, యాసంగిలో పంటల సాగుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆయన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో ఈ మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ముఖ్యంగా, వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయయడం, ఉద్యోగ నియామకాలపై స్పష్టం, కొత్త కరోనా వేరియంట్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవడం, ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి దృష్టి మరింత అప్రమత్తంగా ఉండేలా అధికార యంత్రాన్ని అలెర్ట్ చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు. 
 
అలాగే, రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత 70 - 80 వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ హామీ మేరకు చర్యలు తీసుకునే విషయంపై మంత్రిమండలిలో విపులంగా చర్చించనున్నారు. 
తర్వాతి కథనం
గవర్నర్ అనుమతి పొందాకే, రాజధాని పిటిషన్లపై విచారణ