మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (12:44 IST)

గవర్నర్ అనుమతి పొందాకే, రాజధాని పిటిషన్లపై విచారణ

ఏపీలో మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టులో వేసిన పిటిష‌న్ పై విచార‌ణ కొన‌సాగుతోంది. అయితే, ఇటీవ‌ల మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకుంటూ, ఏపీ ప్ర‌భుత్వం అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. కానీ, దీనికి ఇంకా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్ అనుమ‌తి ల‌భించ‌లేదు. కాబ‌ట్టి, గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి పొందిన త‌ర్వాతే రాజ‌ధాని పిటిష‌న్ల‌పై విచార‌ణ కొన‌సాగిస్తామ‌ని  ఏపీ హైకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది.
 
 
హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఎదుటకు ఏపీ రాజధాని బిల్లల ఉపసంహరణ కేసు విచారణ ఈ రోజు వ‌చ్చింది. పిటిషనర్ల తరపున వాదనల‌ను లు న్యాయవాదులు శ్యామ్‍దివాన్, సురేష్ వినిపించారు. 
ఉప సంహరణ బిల్లుల్లో కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకువస్తామని చెప్పింద‌ని వారు తెలియ‌జేశారు. 
 
 
ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని అని, మాస్టర్ ప్లాన్ కూడా అదే చెబుతుందని పిటిషనర్ తరపు లాయర్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని లాయర్లు వాదించారు. కానీ, ఈ కొత్త బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేద‌ని, గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రాజధాని పిటిషన్లపై విచారణ కొనసాగింపునకు ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంద‌ని న్యాయ‌మూర్తులు తెలిపారు. చట్టానికి లోబడి అభివృద్ధి చేసేందుకు ప్రతిబంధకంగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ శాఖల తరలింపుపై ఉన్న స్టేటస్‍కో ఉత్తర్వులు కొనసాగిస్తూ, ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 27కు వాయిదా వేసింది.