సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (20:42 IST)

3 రాజధానులు: ఇంటర్వెల్ మాత్రమే, శుభం కార్డు పడలేదు: మంత్రి పెద్దిరెడ్డి

మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలోని రాయల చెరువు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించడంలో లోపాలు వుండవచ్చని.. రైతుల పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టులతో జరుగుతోందన్నారు.

 
తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాలుగా ఆ పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్ర చేయిస్తుందని.. ఇప్పుడు కేవలం సినిమాలో ఇంటర్వెల్ ఇచ్చారన్నారు. మూడు రాజధానులకు ఇంకా శుభం కార్డు పడలేదని.. తాను మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాననీ స్పష్టం చేశారు.

 
మూడు రాజధానులపై సీఎం త్వరలోనే మరో నిర్ణయం తీసుకుంటారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. చట్ట పరమైన లోపాలు ఎక్కడ ఉన్నాయని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.