శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (09:46 IST)

నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ!

తెలంగాణా రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులంతా కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సారథ్యంలో తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగనుంది. 
 
ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి తెరాసకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా హాజరుకానున్నారు. ఇందులో పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిచి, సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 
 
ముఖ్యంగా, రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు, వరి ధాన్యానికి మద్దతు ధర, వ్యవసాయ చట్టాల రద్దు, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వం వైఖరి, రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలు తదితర అంశాలపై పార్టీ వైఖరిని, పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన తీరుపై సీఎం పలు సూచనలు చేయనున్నారు.