శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (13:32 IST)

ప్రగతి భవన్‌లో ధాన్యం కొనుగోళ్ళపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ధాన్యం కొనుగోళ్ళపై కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులతో సమావేశమై చర్చల సారాంశాన్ని వివరించారని ఆదేశించారు. ఈ విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్ళపై కేంద్ర ఆహార శాఖామంత్రి పియూష్ గోయల్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదని చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 26వ తేదీన ధాన్యం కొనుగోళ్ళపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. అపుడు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి నుంచి వారికి స్పష్టమైన హామీ రాలేదు. కాగా, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పిందని నిరంజన్ రెడ్డి వెల్లడించిన విషయం తెల్సిందే.