1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Collection of Corona samples stopped in Telangana

తెలంగాణలో కరోనా నమూనాల సేకరణ నిలిపివేత!.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

Corona samples
కరోనా పరీక్షల పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రెండు రోజుల పాటు నమూనాల సేకరణను నిలిపివేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే ల్యాబుల్లో నమూనాలు పేరుకుపోగా, నిన్నటికి 8,253 నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితి వుంది. వీటిని మరిన్ని రోజులు నిల్వ ఉంచితే తప్పుడు రిపోర్టులు వస్తాయన్న ఆలోచనతో, వైద్య వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
గడచిన 9 రోజుల వ్యవధిలో 36 వేల మంది నుంచి నమూనాలను అధికారులు సేకరించారు. అయితే, రాష్ట్రంలోని 10 ప్రభుత్వ ప్రయోగశాలల్లో రోజుకు 2,290 రిపోర్టులు మాత్రమే వెలువరించే అవకాశం ఉంది.

దీంతో పరిశీలించాల్సిన నమూనాలు పెరిగిపోయాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి శనివారం నుంచి నమూనాలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
5జీ ఎకోసిస్టమ్ టెక్నాలజీ వచ్చేస్తుందిగా.. 2జీనే వినియోగిస్తే ఎలా?