మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (09:18 IST)

తెలంగాణ ఉద్యోగులకు పూర్తి వేతనం

తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూన్‌ పూర్తి వేతనం చెల్లిస్తామని ప్రకటించారు.

రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతున్న మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈనెల ఉద్యోగులకు పూర్తి వేతనాలు, పెన్షనర్లకు పూర్తి పింఛన్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు.

పూర్తి జీతం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. 3 నెలలుగా కోత విధించిన వేతనాలు కూడా త్వరలో చెల్లించాలని, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని జేఏసీ ప్రతినిధులు కారం రవీందర్‌రెడ్డి, మమత ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
 
పీవీకి భారతరత్న: కేసీఆర్‌
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు జన్మదినమైన జూన్‌ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అదే రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలను జరుపుతామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించారు.

పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశగతిని మార్చిన గొప్ప వ్యక్తి. భారతరత్న పురస్కారానికి పీవీ సంపూర్ణ అర్హుడు. ఆయనకు ఆ పురస్కారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంత్రివర్గంలో, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం’ అని కేసీఆర్‌ ప్రకటించారు.