1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 మే 2020 (18:05 IST)

రాష్ట్రపతి వేతనంలో 30 శాతం కోత

కోవిడ్ మహమ్మారిపై పోరుకోసం ఇప్పటికే నెలసరి వేతనాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. తాజాగా నెలసరి వేతనంలో 30 శాతం కోత విధించుకునేందుకు సిద్ధమయ్యారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.

ఇలా ఓ సంవత్సరం పాటు కోత విధించుకునేందుకు ఆయన స్వచ్ఛందంగా ఒప్పుకున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు ప్రయాణ ఖర్చులు, సంప్రదాయ విందుల ఖర్చులను కూడా భారీగా తగ్గించుకున్నారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.