బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (07:58 IST)

వైద్య సిబ్బందికి రెట్టింపు వేత‌నం...ఎక్కడ?

హర్యానాలో క‌రోనా నుంచి ప్రాణాలు ర‌క్షించే వైద్య‌సిబ్బంది కోసం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి రెట్టింపు వేత‌నం ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించారు.

‘కరోనా వైరస్ ఉన్నంత కాలం, ఆ విభాగంలో సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందరికీ రెట్టింపు వేత‌నం ఇస్తాం’ అని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.

దీంతో పాటు కరోనా వైరస్ విధుల్లో పోలీసులు ఎవరైనా చనిపోతే ఆయా కుటుంబాల వారికి రూ.30లక్షల పరిహారం కూడా ఇస్తామని ప్రకటించారు.