1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 మే 2020 (17:48 IST)

బ్రెజిల్‌ అధ్యక్షుని ప్రతినిధికి కరోనా పరీక్షలు

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ పరీక్షలు జరిపినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. అయితే బోల్సెనారో గురించి తెలియాల్సి వుంది.

బోల్సెనారో స్పోక్స్‌మాన్‌ అయిన ఒటావియో డో రెగో బారోస్‌ (59) ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారని, అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేవని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు జరిపినట్లు సమాచారం.
 
భారత్ లో రెండు వారాల్లో రెట్టింపు
గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతంగా విజృంభిస్తోంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యులు షమికా రవి తెలిపిన వివరాల ప్రకారం దేశంలో కరోనా వద్ధి రేటు ఇప్పుడు 6.6 శాతంగా ఉంది. మే 2 న ఈ వఅద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. గతంలో కరోనా కేసులు 15 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. 
 
అయితే ఇప్పుడు 11 రోజుల్లోనే రెట్టింపు అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,561 కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు.

మొత్తం కేసుల సంఖ్య 52, 900 కాగా, 1783 మంది మృత్యువాతపడ్డారు. 15,267 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 16,758 కేసులు నమోదయ్యాయి.