శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (20:52 IST)

వెంకయ్య నెల జీతం విరాళం

ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడానికి ప్రకటించారు.

వీటితో పాటు కేంద్రం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం టీం ఇండియా స్ఫూర్తిగా ముందుకెళ్తోందని కితాబునిచ్చారు. ఈ దిశలోనే ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు తన వంతుగా చిన్న సహకారాన్ని అందిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ఆ లేఖలో ప్రస్తావించారు. 
 
సీఎం సహాయ నిధికి విరాళాలు
కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను కలుసుకుని విరాళాలు సమర్పించారు. 

మెగా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల ఎండీ పీ.వీ. కృష్ణారెడ్డి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎంకు అందించారు. 

కరోనా వైరస్‌ నివారణకు విజయవాడకు చెందిన సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం సహా బోధన, బోధనేతర సిబ్బంది కలిపి రూ.1.3 కోట్ల విరాళాన్ని అందించారు.

దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి జగన్‌కు సిద్దార్థ విద్యాసంస్థల కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు అందించారు.

విజయవాడ వైయస్సార్‌సీపీ నాయకుడు దేవినేని అవినాష్, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా విరివిగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందాయి.