బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (08:22 IST)

కీచకుల్లో మార్పు రావాలి : వెంకయ్యనాయుడు

కీచకుల్లో మార్పు రావాలే తప్ప వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు తీసుకొచ్చినా ప్రయోజనం వుండదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే సమాజంలో మార్పు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… చట్టాల ద్వారానే మార్పు రాదని, సమాజంలో మార్పు కోసం అందరూ బాధ్యతగా ఉండాలని సూచించారు.

సమాజంలో విలువలు వుంటే దిశ లాంటి ఘటనలకు ఆస్కారం వుండవని అన్నారు. దిశ లాంటి ఘటనల్లో వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. మన సంస్కృతిని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయని, సంస్కృతిని కాపాడుకుంటే మంచి నడవడిక అలవడుతుందని అన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి గురించి ఆయన మాట్లాడారు.