1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Coronavirus effect, a private teacher who sells eggs

కరోనా తాండవం, కోడిగుడ్లు అమ్ముకుంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయుడు

Coronavirus effect
ఆయన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు, 15 ఏళ్ల పాటు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు. చేతిలో ఉన్న ఐదు డిగ్రీలతో గతంలో కుటుంబ పోషణను కొనసాగించాడు. కరోనా విజృంభణతో అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి కరువైంది. చేతిలో ఐదు డిగ్రీల ఉన్నా నోటిలో ఐదు వేళ్లు పోలేని దుస్థితి ఏర్పడింది.
 
కరోనాతో ప్రైవేట్ ఉపాధ్యాయుల అవస్థలు అంతాఇంతా కాదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన హైదర్‌ఖాన్ ఎంఏ, బిఈడీ, ఇంగ్లీష్‌లో పీజీ కూడా చేశారు. ఆ తర్వాత పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి అందరి ప్రరశంసలు అందుకున్నారు.
 
కాగా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రైవేట్ టీచర్లపై పడింది. తనతో పనులు చేయించుకున్న విద్యాసంస్థలు చేతులెత్తేసాయ్. దీంతో ఉపాధి కరవై పనిలేక సొంత ఊరికెళ్లి కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహంచలేకపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
About Writer
వి
తర్వాతి కథనం
ఈత ఆకు రాలేలావుంది... కానీ, జగన్ సర్కారు పైసా ఇవ్వడంలేదు...