సంబంధిత వార్తలు
- చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమామ్ హల్ హక్ గుడ్‌బై...
- బ్రెయిన్ స్ట్రోక్ నుండి 50 ఏళ్ల పురుషుడిని రక్షించిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్
- ప్రభాస్‌కు ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన న్యూజిలాండ్‌లో ఉన్న కన్నప్ప టీం
- కివీస్‌తో కీలక మ్యాచ్ : హార్దిక్ పాండ్యా స్థానంలో ఎవరు?
- భారత్‌ను ఓడిస్తే.. బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా : పాకిస్థాన్ నటి
నేడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నిక సంఘం బృందం పర్యటన
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘానికి చెందిన డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలతో కూడిన ఈసీ బృందం బుధవారం తెలంగాణాలో పర్యటించనుంది. ఈ బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది.
ఈసీ బృందం... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం ఎన్ఫోర్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశంకానుంది.
ఇప్పటివరకు చేపట్టిన తనిఖీలు, స్వాధీనాలపై సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితరాలపై చర్చిస్తారు.
తర్వాతి కథనం